డ్రగ్స్ విషయంలో ఏపీలో రాజకీయ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డ్రగ్స్‌ను అధికార పార్టీ నేతలే సరఫరా చేయిస్తున్నానరని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే.. రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపేందుకే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిన్నమెదడు చిట్లినట్లు ఉందని.. ఆయనకు మతిపోయిందని కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు డ్రగ్స్ వాడుతున్నాడనే అనుమానం ఉందని… తక్షణమే ఆయనకు నార్కో పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: ఏపీకి రమ్మని సీఎం కేసీఆర్‌ను పిలిచిందెవరు?
చంద్రబాబు అధికార దాహంతో, అధికార మదంతో ఢిల్లీకి వెళ్లి ఆర్టికల్ 356 అమలు చేయాలని కోరుతున్నారని విప్ కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే డ్రగ్స్ అంటూ విషాన్ని కక్కుతున్నారన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని.. బద్వేల్‌లో బీజేపీని చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాసులు విమర్శించారు.