రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని.. అందుకే తాను ఆ పార్టీలో చేరానన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని… బీజేపీ, టీఆర్ఎస్ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో బడా మోదీ, రాష్ట్రంలో…
తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో కేంద్రంస్పష్టత ఇవ్వాలన్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారు. “ఆహార భద్రత చట్టం” కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యత అని అన్నారు. భారత్ లో తెలంగాణ లేదా..? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు…
వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇది చాలా గంభీరమైన విషయమన్నారు. మరోసారి సమీక్ష చేసి రైతాంగాన్ని సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదన్నారు. అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి, ఇదే దేశ భక్తి అంటే ఎలా…? అని…
కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరి మారుతుందని వారం రోజుల నుంచి ఆశపడ్డాం అయినా.. వారిలో మార్పు లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయమని కేంద్రం తెలిపిందన్నారు. దీంతో వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు. పీయూష్ గోయల్‌ను కలిసిన సమయంలో రిక్వెస్ట్ చేస్తే ఆయన పట్టించుకోలేదని… లిఖిత పూర్వకంగా…
1. తెలంగాణ రైతుల హక్కులను టీఆర్ ఎస్ ప్రభుత్వం బీజేపీకి తాకట్టు పెట్టిందని.. రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖరీఫ్ ధాన్యం కొనకుండా రైతు సమస్య నుండి తప్పించుకునే కుట్ర సీఎం కెసిఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూడు నెలల నుండి రైతులు హరిగోస పడుతున్నారని… కళ్ళాల దగ్గర వడ్లు, ఇంటి దగ్గర రైతుల శవాలు అన్నట్టుంది పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు. రైతుల హక్కులను బీజేపీకి తాకట్టు పెట్టింది :రేవంత్ రెడ్డి 2.నదిలో ప్రయాణిస్తున్న…
ఇవాళ ఏపీలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర సహ ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే…ఏపీలో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు గత ప్రభుత్వం చంద్రన్న పేరు పెట్టుకుంటే.. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న పేరుతో అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి…
ఏపీలో సినిమా టిక్కెట్ల ధర విషయంపై అగ్గి రాజుకుంది. హీరో నాని చేసిన కామెంట్లపై ఒకవైపు ప్రభుత్వం విమర్శిస్తుంటే.. మరోవైపు పలువురు ప్రతిపక్షాల నేతలు నానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ‘ఏంటో మరి’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. Read Also: హీరో నానికి మంత్రి అనిల్ కౌంటర్.. పవన్ మోజులో పడి చాలా తగలేశా..! ‘నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు…
కేసీఆర్ ఆయన మంత్రులు చెప్పేదొకటి, చేసేదొకటని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.బీజేపకీ ప్రభుత్వం లక్ష్యాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని మంవడిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు , మంత్రులు ఢిల్లీ వెళ్లి వానాకాలం పంటను కొనుగోలు చేయమని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య యాసంగి పంటదని వాటి పై మాట్లాడకుండా కేసీఆర్ బీజేపీ తో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వారి…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. ఇప్పటికే హీరో నాని వ్యాఖ్యల పట్ల పలువురు మంత్రులు స్పందించగా.. తాజాగా మంత్రి కన్నబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని…
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని రాష్ట్ర పథకాలుగా జగన్ సర్కారు ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ మండిపడ్డారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జీవీఎల్ వెల్లడించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శలు చేశారు. Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు కేంద్ర పథకాలు అమలు…