కేసీఆర్ ఆయన మంత్రులు చెప్పేదొకటి, చేసేదొకటని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.బీజేపకీ ప్రభుత్వం లక్ష్యాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని మంవడిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎంపీలు , మంత్రులు ఢిల్లీ వెళ్లి వానాకాలం పంటను కొనుగోలు చేయమని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య యాసంగి పంటదని వాటి పై మాట్లాడకుండా కేసీఆర్ బీజేపీ తో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వారి మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ యాసంగి లో వరి వేయొద్దని చెబుతుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొనుగోలు చేయాలని కోరడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. జిల్లా మంత్రి ఇప్పటి వరకు యాసంగి వరి పంట సాగు పై మాట్లాడకుండా అధికారులతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ లో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా రైతులను అయోమయ స్థితిలో నెట్టి వేయకుండా ప్రభుత్వం రైతులకు స్పష్టత నివ్వాలని ఆయన కోరారు. కేసీఆర్‌కు ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. ఆరోజు దగ్గర్లోనే ఉందని భట్టి అన్నారు.