అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు. Read Also:అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం…
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండి అటు అమరావతి, ఇటు పోలవరంకు వెళ్లనీయకుండా పశ్చిమ గోదావరిలోని టీడీపీ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీంతో టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం గా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనసేన కార్యాలయానికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం నాడు గుంటూరు జిల్లా కుంచనపల్లిలో పర్యటించిన నారా లోకేష్… అనూహ్యంగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జనసేన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. కుంచన పల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. Read Also: వెంకయ్య మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న…
ఏపీలో జగన్ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు ప్రయత్నించారని.. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఎమ్మెల్యే గోరంట్ల ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టుల అంశంలో కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం సంతోష్ భార్య నిండు గర్భవతి అని, ఆమె ఆసుపత్రిలో ఉందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో సంతోష్ ను…
ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పిలుపు అందింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతోనే డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గురువారం సాయంత్రం సోనియాతో డీఎస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాతే డీఎస్ చేరికపై…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్వరం మార్చారు. ఇటీవల రాహుల్ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్… తాజాగా తన మాట మార్చుకుని రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ పరివారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా వ్యాఖ్యలు…
నాకు హుజురాబాద్ నియోజకవర్గం ఉందని, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. ధాన్యం విషయంలో కేసీఆర్ తన వైఫల్యాన్ని కేంద్రం పై మోపుతున్నాడని ఈటల అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వాళ్ల మంత్రుల మాటలను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితిలో లేదన్నారు. ఇంత నీచంగా హరీష్‌రావు ప్రవర్తిస్తారని తెలంగాణ ప్రజలకు తెల్సింది. ప్రాంతీయ పార్టీల్లో వారసులే సీఎంలు అవుతారు. బీజేపీ…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తాను ముందే చెప్పానని లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. తాతా మధు గెలిచిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. తాతా మధుని అత్యధిక మెజార్టీతో గెలిపించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎ కేసీఆర్ పాలన, యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే…
మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంతిళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కుటుంబంతో కలిసి ఆయన దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షకు టీడీపీ నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి రాకముందు ఆయన చేపట్టిన పాదయాత్రలో టిడ్కో ఇళ్లు అందరికీ పూర్తి ఉచితంగా ఇస్తానని…