తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో కేంద్రంస్పష్టత ఇవ్వాలన్నారు. రైతులతో రాజకీయం చేస్తున్నారు. “ఆహార భద్రత చట్టం” కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యత అని అన్నారు.
భారత్ లో తెలంగాణ లేదా..? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు కాదా..? అంటూ ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తొమ్మిది రోజులు పార్లమెంట్‌లో ఆందోళన చేసినప్పట్టికీ పట్టించుకోలేదన్నారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామన్నారు. బీజేపీ ఎంపీలు రైతుల గురించి ఒక్క మాట మాట్లడలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం ధాన్యం కొనుగోలు అంశంపై మరోసారి ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దని, రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.