1.2019-20కి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులలో టీఆర్ఎస్ పార్టీ, అప్పులలో టీడీపీ టాప్‌లో ఉన్నాయి. జాతీయ పార్టీల విషయానికి వస్తే… బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉంది. ఆ పార్టీకి రూ.698.33 కోట్లు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. జాతీయ పార్టీల…
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం, జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ఆయన విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలను మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని నిలదీశారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ…
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయటపడతాయని, కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందని భయమని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడంలేదని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. Read Also: తెలంగాణకు శుభవార్త.. నాబార్డ్ నుంచి 1.66 లక్షల రుణం…
ఇటీవల ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలిచిన తాతామధు గురువారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న గ్యాప్‌లను భర్తీ చేస్తానన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు. పార్టీలో నిర్మాణ పరమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా తన వంతు సాకారం అందిస్తానని వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతం ను, తెలంగాణ ఏర్పడడానికి గల కారణాలను ప్రజల వద్దకు తీసుకుని ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీని ఒక్క…
దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. రుణ మాఫీ ,డబల్ బెడ్ రూమ్ ,పెన్షన్ లాంటి పనులు సరిగా ఇవ్వని టీఆర్ఎస్ నాయకులపై ఇలానే దాడులు చేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడానికైనా కాషాయ కార్యకర్తలు వెనుకడారన్నారు.…
1.యూపీ ఎన్నికల్లో ఎన్నో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమయిన యూపీ ఎన్నికలు దేశానికి మార్గనిర్దేశనం చేస్తాయనడంతో అతిశయోక్తి లేదు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఎన్నికల ముందు ఆయాపార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. 2.ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు కీలక ఆయుధంగా పనిచేస్తోంది వ్యాక్సినేషన్.. భారత్‌లో దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఇతర దేశాలకు కూడా సరఫరా చేసింది.. ఇక, ఇప్పుడు…
కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా భావించడం లేదని ఆమె మండిపడ్డారు. కౌలు రైతు బతికి ఉన్నంత వరకు రైతు బీమా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు షర్మిల లేఖ రాశారు. రైతు బీమా విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. కౌలు రైతులను రైతులుగా ఎందుకు చూడరని ఆమె ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివి పడేసిన అపర…
1.రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడకు రానున్నారు. 2.ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా…
తెలంగాణలో విద్యార్థులు ..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ విధానాలవల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో…
తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పైసా నిధులివ్వడంలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మాటలు, ప్రశంసలతోనే కేంద్రం కాలం వెళ్లదీస్తుందన్నారు. పైగా రాష్ట్రాల విషయాలలో అడ్డుతగులుతుందని ఆరోపించారు. ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్ అధికారులు స్వేచ్ఛగా పని చేయకుండా,సర్వీసు రూల్స్‌ను సవరిస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించే ప్రయత్నాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. Read Also: పేద బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవద్దా..?…