1.కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాలు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది కెనడా సర్కార్.. భారత్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత కట్టడి చర్యల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్షల బాటపట్టాయి. 2.ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు…
హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం.. వాటిని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో తిరుమల స్వామి దేవాలయం వద్ద అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులకు ఇక్కడకొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. Read Also: నేరగాళ్లకు ఏపీ ఫ్రెండ్లీ స్టేట్‌గా…
తెలంగాణ రాష్ట్రం వచ్చినా నిరుద్యోగులు,రైతుల ఆత్మహత్యలు ఆగలేదని వీహెచ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే బాధగా ఉందన్నారు. కొట్లాడి న్యాయం జరిగేవరకు సాధించుకుందాం..ఆత్మహత్యలు ఆపండి అంటూ వీహెచ్ కోరారు. Read Also: శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలి: జీవన్‌రెడ్డి దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆపదలో ఉన్నాడు: కోదండ రెడ్డి..ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడుదేశానికి…
టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొడాలి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించాల్సింది పోయి ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని… డబ్బా పార్టీ అని…
టీడీపీ నేత, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయనో కట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ చరిత్రలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే ఆయన పేరే వినిపిస్తుందని అన్నారు. ఒక ఏడాదిలో 300 రోజులకుపైగా ఓవర్ డ్రాఫ్ట్.. వేస్ అండ్ మీన్స్కు వెళ్లిన చరిత్ర ఆయనది అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. Read Also: 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. మూడు రాజధానులు అలాగే వస్తాయి: మంత్రి…
మూడు రాజధానుల అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. అదే తరహాలో మూడు రాజధానులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాల విభజన చారిత్రాత్మకం, అభివృద్ధి దాయకం అని ఆయన తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు మరోసారి పెంపు తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా…
1.2019-20కి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులలో టీఆర్ఎస్ పార్టీ, అప్పులలో టీడీపీ టాప్‌లో ఉన్నాయి. జాతీయ పార్టీల విషయానికి వస్తే… బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉంది. ఆ పార్టీకి రూ.698.33 కోట్లు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. జాతీయ పార్టీల…
ఏపీలో కొత్త జిల్లాల విభజనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం, జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ఆయన విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలను మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని నిలదీశారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ…
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయటపడతాయని, కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందని భయమని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడంలేదని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. Read Also: తెలంగాణకు శుభవార్త.. నాబార్డ్ నుంచి 1.66 లక్షల రుణం…
ఇటీవల ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలిచిన తాతామధు గురువారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న గ్యాప్‌లను భర్తీ చేస్తానన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు. పార్టీలో నిర్మాణ పరమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా తన వంతు సాకారం అందిస్తానని వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతం ను, తెలంగాణ ఏర్పడడానికి గల కారణాలను ప్రజల వద్దకు తీసుకుని ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీని ఒక్క…