కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయటపడతాయని, కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందని భయమని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడంలేదని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు.
Read Also: తెలంగాణకు శుభవార్త.. నాబార్డ్ నుంచి 1.66 లక్షల రుణం మంజూరు
కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని జీవన్‌రెడ్డి వ్యాఖ్యనించారు. కేసీఆర్ విధానాలతో రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్ప కాకముందే ప్రజలు మేల్కొవాలని జీవన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందని తెలిపారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అంతా సజావుగానే ఉందని ప్రజలను నమ్మిస్తు మోసం చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శలు చేశారు.