1.రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడకు రానున్నారు.
2.ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలుగుతోందని సదరు సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత (అవినీతి లేకపోవడం) దేశాల ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వ ర్యాంకులో నిలిచింది.
3.తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలన సౌలభ్యం ఉండాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని, జిల్లాల విభజన స్వాగతించాల్సిన అంశం అన్నారు.జిల్లాల విభజన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. పరిపాలన సౌలభ్యం పెరుగుతుందన్నారు.
4.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. ఓ వింత పరిస్థితి ఇప్పుడు అధికార బీజేపీకి ఎదురైంది.. ఎందుకంటే.. ఒకేస్థానం కోసం ఓవైపు మంత్రి ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరోవైపు.. అదే స్థానం కోసం.. ఆమె భర్త కూడా తీవ్రంగా ప్రయత్నించడం ఇప్పుడు చర్చగా మారింది.. అదే సరోజనీనగర్ అసెంబ్లీ స్థానం.. ఈ స్థానంకోసం సీఎం యోగి ఆదిత్యనాద్ కేబినెట్‌లోని మంత్రి స్వాతి సింగ్, ఆమె భర్త పార్టీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ఇద్దరూ ఎవరి ప్రయత్నం వారు చేసుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది.
5.తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాడులకు తెగబడుతుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పై విమర్శల దాడులకు దిగారు. తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన సాగుతుందని విమర్శించారు.
6.దేశంలో సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌లలో ఒకరు ఆనంద్ మహీంద్రా. కార్ల కంపెనీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బిజినెస్ తో పాటు సోషల్ మీడియాలో సైతం ఆనంద్ మహీంద్రా నిత్యం బిజీగా ఉంటారు. కొత్త టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంలో నిత్యం ముందు వరసలో ఉంటాడు. ఇక, మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ లోహర్ అనే వ్యక్తి తన కుమారుడి కోసం పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారు చేశాడు.
7.తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలను తగ్గించడంతో పాటు.. పెన్షన్ పథకంలో తమ వాటాను పెంచుతున్నట్టు వెల్లడించారు.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 5 రోజులపాటు పనిచేస్తే సరిపోతోంది.. అంతే కాకుండా.. పెన్షన్ పథకంలో రాష్ట్రప్రభుత్వ వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
8.రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనను చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్‌ను విభజించిన జగన్ ప్రభుత్వం మదనపల్లికి జిల్లా కేంద్రం విషయంలో మదనపల్లి ప్రజలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దూరం చేసిందన్నారు.
9.ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తూనే వుంటుంది. ఇప్పటి వరకూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ట్విట్టర్‌లో లేదు. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చేందుకు కంపెనీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇలాంటి ఆప్షన్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. కానీ ఈ విషయం గురించి కంపెనీ ఇప్పుడే ఆలోచించింది.
10.అన్నీ అనుకున్నట్టు జరిగితే… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హృతిక్ రోషన్, కరీనా కపూర్ కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి అభిమానులకు ఓ రకంగా ఇదో శుభవార్త. ‘కభీ ఖుషీ కభీ గమ్’ లాంటి సూపర్ హిట్ మూవీలో నటించిన ఈ సక్సెస్ ఫుల్ జోడీ చివరగా 2003లో ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’లో నటించారు. ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై జంటగా నటించే ఛాన్సే రాలేదు.