టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని.. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే…
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంపై తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ జ్వరం అని చెప్తూ తప్పించుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. అనుకున్న విధంగానే జరిగిందని.. గతంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన చంద్రబాబు, పంజాబ్ సీఎం చన్నీ అడుగు జాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హిందూపురం జిల్లా కోసం హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన మౌన దీక్ష చేపట్టనున్నారు. ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత బాలయ్య దీక్ష చేపట్టనున్నారు. Read Also: రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలి: బైరెడ్డి శుక్రవారం…
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు (గురువారం) తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు…
కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు చేసిన కేటాయింపులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదని ఆయన ఆరోపించారు. దేశంలో షెడ్యూల్ క్యాస్ట్‌కు చెందినవారు 28 శాతం ఉంటే కేంద్ర ప్రభుత్వం రూ.20వేల కోట్లు కేటాయించిందని.. అదే దళిత బంధు కోసం ఒక్క తెలంగాణ ప్రభుత్వం రూ.25వేల కోట్లు ఖర్చుపెడుతోందని కడియం శ్రీహరి వివరించారు. బీజేపీకి చేతనైతే దళిత బంధును దేశమంతా…
ఏపీలో జగనన్న గోరుముద్ద పథకంలో అవినీతి జరిగిందన్న టీడీపీ నేతల ఆరోపణలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఖండించారు. ద్యార్థులకు ఇచ్చే చిక్కి కోసం రూ.350 కోట్లు వెచ్చిస్తున్నామని, గ్లోబల్ టెండర్ ప్రకారమే వీటి సరఫరా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. నాణ్యతను కూడా టాటా కన్సల్టెన్సీ లాంటి ఏజెన్సీ ద్వారా తనిఖీ చేయించి టెండర్లు ఇచ్చామని మంత్రి సురేష్ తెలిపారు. తమ ప్రభుత్వం ఎవరికీ అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదనే విషయాలను ప్రతిపక్షాలు గుర్తించాలని హితవు పలికారు.…
ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు జగన్ సర్కార్ ఉద్దరించింది ఏం లేదని మండి పడ్డారు. టీడీపీ హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు చాలా ఇచ్చామన్నారు. సొంత మగ్గం లేకున్నా రిబేటుతో సహా ఏడాదికి రూ.…
కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల తీరును కేసీఆర్ తప్పు పట్టారని, కానీ ఐఏఎస్ ఐపీఎస్‌ల వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఉత్తమ్ అన్నారు. 14 మంది ఐఏఎస్‌లను తప్పించి.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లను సీఎస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.…
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి…
1.రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఎల్లుండి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామన్నారని కేటీఆర్ అన్నారు.. 2.ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశాల్లో రష్యాకూడా ఒకటి. కావాల్సినంత స్థలం ఉన్నది. వనరులు ఉన్నాయి.…