సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాగారం మండలం, తిరుమలగిరి మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. నాగారంలోని మండల కేంద్రంలో కడియం సోమక్క వెంకయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునందర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి ప్రాంతంలోని తిరుమలగిరి ప్రాంతాన్ని దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.దళిత బంధు పై కేసీఆర్ మాటలు కోటలు దాటాయి తుంగతుర్తి వరకు చేరాయి కానీ దలిత బంధు అమలు కాలేదని విమర్శించారు.తుంగతుర్తి ప్రాంతంలో రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీ పార్టీని దాడులతో అణగదొక్కాలని చూడటం ఎంతవరకు సమంజసమన్నారు.
Read Also: రేపటి నుంచి బీజేపీ మైక్రో డొనేషన్స్ ప్రారంభం
ఏడాది కిందట అసెంబ్లీ సాక్షిగా చెప్పి సంవత్సరం గడిచినా ఇప్పటికీ అమలు చేయపోవడంతో ఆంతర్యం ఏమిటని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మారితే ఇసుక తరలించడానికి ట్రాక్టర్లకు అనుమతులు లభిస్తాయని ఎద్దేవా చేశారు. జీవో 377కి సంబంధించి అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం అడిగినా ఇప్పటి వరకు దానిపై స్పందన లేదన్నారు. చదువుకున్న విద్యావంతుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకున్నారన్నారు . ఈప్రాంత ప్రజలకు దళిత బంధు అమలు అమలవుతుంది అనుకున్నాం కానీ ఏమైంది. ఫిబ్రవరి 5 లోగా అభ్యర్థుల ఎంపికలో గైడ్‌లైన్స్ లేకుండా ఎలా పూర్తి చేయాలని సీఎంని ప్రశ్నిస్తున్నామన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి అండగా మేమున్నాం. ఉద్యోగ నిరుద్యోగ ఆత్మహత్యలు, ప్రభుత్వ హత్యగా భావించి వారిని ఆదుకోవాలన్నారు. సీఎం దళిత బంధు బీజేపీ నాయకులకు ఇష్టం లేదని నెపం బీజేపీ పై నెడుతున్నారన్నారు. తుంగతుర్తి నుండి అడుగుతున్న రాష్ట్రంలో అందరూ దళితులకు దళిత బంధు ఎప్పుడు ఇస్తారని అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.