1.నేతలు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సర్వ సాధారణ విషయం.. కానీ, కొన్నిసార్లు విమర్శలు చేస్తూ నోరు జారడం వివాదాస్పదంగా మారి.. విమర్శలకు దారితీసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి.. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారేకు వచ్చింది.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2.భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు…
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ బీజేపీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన… తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. మధు మోహన్‌తో పాటు ఆయన అనుచరులు కూడా కాషాయ కండువాలు కప్పుకున్నట్లు తెలుస్తోంది. Read Also: Bandi Sanjay: కాంగ్రెస్‌ను తిడితే టీఆర్ఎస్కు…
1.ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో చర్చించారు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. ఈ నెల 10న సీఎం జగన్ తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం వున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తో సినిమటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 2.ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖలు…
జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కొందరు కోర్టుకు వెళ్లారని.. పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతిస్తున్నారని జగన్ ఆరోపించారు. అయితే ఎర్రజెండా వెనుక పచ్చజెండా అజెండా ఉందని జగన్ విమర్శించారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు అని.. కానీ చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే సమ్మెలు, ఆందోళనలు చేయడం…
1.తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని, టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డి లేఖలో ఆరోపించారు. 2.టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు…
ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడం తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. Read Also: ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం…
టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని.. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే…
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంపై తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ జ్వరం అని చెప్తూ తప్పించుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. అనుకున్న విధంగానే జరిగిందని.. గతంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన చంద్రబాబు, పంజాబ్ సీఎం చన్నీ అడుగు జాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం…
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హిందూపురం జిల్లా కోసం హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన మౌన దీక్ష చేపట్టనున్నారు. ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత బాలయ్య దీక్ష చేపట్టనున్నారు. Read Also: రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలి: బైరెడ్డి శుక్రవారం…
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు (గురువారం) తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు…