1.తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని, టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని రేవంత్‌రెడ్డి లేఖలో ఆరోపించారు.
2.టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో కోత విధించిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా సజ్జల ఉద్యోగుల్ని బెదిరించారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో ఈ ప్రభుత్వం కోత విధించడం సీఎం పెద్ద మనస్సుకు నిదర్శనమా?
3.ఉత్తర కొరియా గత దశాబ్దకాలంగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఆయుధాలను తయారు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సొంతంగా క్షిపణులను తయారు చేసుకుంటూ దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలను భయపెడుతున్నది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఏ క్షిపణిని ప్రయోగిస్తారో తెలియక చుట్టుపక్కల దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
4.వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అందజేయనుంది. రజక, నాయీబ్రహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న కానుకను ఈ ఏడాది కూడా అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా రూ.285.35 కోట్ల ఆర్థిక సాయంను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది.
5.ఏపీలో పీఆర్సీ విషయంలో కొన్ని సంఘాలు సంతృప్తిగా వున్నా యూటీఎఫ్ లాంటి సంఘాలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఈ పీఆర్సీతో సంతృప్తి చెందలేదన్నారు. సమావేశ హాజరు పట్టీ సంతకాలను ఒప్పందంపై సంతకాలుగా చూపిస్తున్నారన్నారు.
6.కరోనా కాలంలో ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చేసే పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. మహమ్మారి విస్తరిస్తున్న వేళ నిబంధనలు పాటిస్తూ గతంలో వివాహాలు జరిగాయి. కొన్ని చోట్ల వర్చువల్‌గా వివాహాలు జరిగాయి. కరోనా తగ్గుముఖం పడుతున్నా జన సమూహానికి తావులేకుండా పరిమిత సంఖ్యలోనే వివాహాలకు అనుమతి ఇస్తున్నారు. కొంతమంది పెళ్లి విషయంలో మరింత వెరైటీగా ఆలోచించి పెళ్లి శుభలేఖల మొదలు అన్నీ కొత్తగా ఆలోచిస్తున్నారు.
7.విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రం తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భార్యల పోరును తట్టుకోలేని భర్తలుగా వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్ ని వినోదాత్మకంగా చూపించిన అనిల్ ఈసారి ఎఫ్ 3లో ఇంకా వినోదాన్ని జోడించాడు. ఫన్ కి ఫ్రస్ట్రేషన్ కి డబ్బు ని కూడా జోడించి మరింత వినోదాన్ని పంచుతాను అంటున్నారు.
8 యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కథలను తెరకెక్కించడానికి నేటి తరం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ అనే పేరులో ఓ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ‘పుంగనూరు – 500143’ అనేది ట్యాగ్ లైన్! ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈ నెల 14 ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
9.ప్రయాణాలు చేయడం చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కొంతమంది అడ్వెంచర్ జర్నీలు చేస్తుంటారు. అడ్వెంచర్ జర్నీలు చేసే వారు పర్వతాలను అధిరోహించేందుకు అసక్తి చూపుతుంటారు. కొన్ని పర్వతాలు అధిరోహించేందుకు చాలా ఈజీగా ఉంటాయి. కొన్ని మాత్రం ఇబ్బందులు పెడుతుంటాయి. కానీ, పాకిస్తాన్‌లో ఉన్న నంగా పర్బత్ అనే పర్వతాన్ని అధిరోహించాలంటే ప్రాణాపై ఆశను వదిలేసుకోవాల్సిందే. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఈ నంగా పర్బత్ తొమ్మిదవది…
10. ప్రస్తుతం టాలీవుడ్ కొన్ని సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గతకొన్నిరోజుల నుంచి ఏపీ లో టిక్కెట్ ధరల విషయమై చర్చ నడుస్తున్న విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం ఏపీ టిక్కెట్ రేట్లు తగ్గించడంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేయడం, పలువురు ప్రముఖులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని తెలపడం. ఇక వాటన్నింటిని ఆపడానికి ఇండస్ట్రీ పెద్దగా కాకుండా ఇండస్ట్రీ బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ ని కలవడం జరిగాయి.