ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హిందూపురం జిల్లా కోసం హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన మౌన దీక్ష చేపట్టనున్నారు. ముందుగా హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి.. ఆ తర్వాత బాలయ్య దీక్ష చేపట్టనున్నారు.
Read Also: రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలి: బైరెడ్డి
శుక్రవారం ఉదయం హిందూపురం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉద్యమ కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం అఖిలపక్ష నేతలతో బాలయ్య చర్చించనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశం కానున్నారు.