ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు జగన్ సర్కార్ ఉద్దరించింది ఏం లేదని మండి పడ్డారు. టీడీపీ హయాంలో చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, రుణాలు, వడ్డీ రాయితీలు చాలా ఇచ్చామన్నారు. సొంత మగ్గం లేకున్నా రిబేటుతో సహా ఏడాదికి రూ. లక్ష సాయం అందజేశామని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
Read Also: ఇది చాలా మంచి బడ్జెట్: రామకృష్ణ
నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవని అవేవి ఇప్పుడు అందడం లేదని ఆరోపించారు. ఆప్కో ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పథకాలు లేవు, ఆ సబ్సీడీలు లేవు మార్కెటింగ్ లేదు. చివరికి స్కూల్ యూనిఫాం కూడా పవర్ లూంకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి ప్రచారం, అసమర్థ పాలనతోనే చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. పెడన ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Achennaiudu criticized the Jagan government.