1.దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. గత నెల కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన ఫీవర్ కేసు బయటపడింది. తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు(57) మంకీ ఫీవర్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ వయనాడ్ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్ లక్షణాలు ఉండగా.. వైద్య పరీక్షలు చేశారు. వారు అనుకున్నదే నిజమైంది.
2.హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ఎఐసీ (ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) ప్రతిష్టాత్మకమైన ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపును వరుసగా రెండోసారి అందుకుంది. 2021 సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రయాణికుల అవసరాలను అర్థం చేసుకోవడానికి, వారి ఆందోళనలను పరిష్కరించడానికి వారి ప్రయాణీకుల మాటలు వినడానికి…
3. కాపు రిజర్వేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా కాపు రిజర్వేషన్ల గురించి రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి వున్నారని ఆయన అన్నారు.
4.కరోనా మహమ్మారి విషయంలో కేంద్రం కొత్త గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్షన్‌ను పక్కన పెట్టింది. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చేవారు తప్పని సరిగా ఏడు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. ఏడు రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆన్‌లైన్ డిక్లరేషన్ ఫామ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో రెండు వారాల ట్రావెల్ హిస్టరీ గురించి డీటెయిల్‌గా వివరించాల్సి ఉంటుంది.
5.ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమత్రి సీఎం జగన్ తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ ముగిసింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ, కమెడియన్ ఆలీ, నటుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను సీఎం కి తెలిపి ఒక పరిష్కారాన్ని కోరారు.
6. వైసీపీ నేత యాక్టర్ అలీకి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే యాక్టర్ అలీకి రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలీతో మరోవారంలో కలుద్దామని సీఎం జగన్ అన్నారు. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల్లో ఒక స్థానం మైనార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మైనార్టీ స్థానం ఇప్పుడు అలీని వరించనున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్, పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి, దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ కొరటాల శివలతో పాటు అలీ ఈరోజు సీఎం జగన్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా టికెట్ల ధరలపై భేటీ అయిన విషయం తెలిసిందే.
7.రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణపై మరోసారి అక్కసు వెళ్లగక్కారని, అమరుల త్యాగాలను కించపరచారని మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలు గమనిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సాధన కోసం వేల మంది ప్రాణాలు అర్పించారని, ఆ అమరుల త్యాగాలను మోదీ అవమానిస్తున్నారని మండిపడ్డారు.
8. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సమస్య రోజురోజుకు జఠిలం అవుతున్నది. క్రియాను రష్యా అక్రమించుకున్నాక ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా భారీ ఎత్తున సైన్యాన్ని ఆయుధాలను మోహరించింది. అయితే, ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా నాటో దళాలు రంగంలోకి దిగాయి. నాటో దళాలు రంగంలోకి దిగడంపై రష్యా స్పందించింది.
9.చియాన్ విక్రమ్ గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే సమయంలో విక్రమ్ తనయుడు ధ్రువ్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’తో తమిళనాట హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఈ తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో కార్తీక్ సుబ్బరాజు ‘మహాన్’ పేరుతో సినిమా తీస్తున్నాడనగానే సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొవిడ్ కారణంగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
10.చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు. ఒక సినిమా షూటింగ్ లో ప్రేమ మొదలై .. పెళ్లిపీటలు వరకు వెళ్లిన జంటలు చాలా ఉన్నాయి. ఇక ఈ లిస్టులోకే చేరుతున్నారు కోలీవుడ్ లవ్ బర్డ్స్ గౌతమ్ కార్తీక్ – మంజిమా మోహన్. ఈ ఇద్దరు తెలుగువారికి సుపరిచితమే. కడలి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు అలనాటి సీనియర్ హీరో కార్తీక్ వారసుడు గౌతమ్ కార్తీక్.