తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. శుక్రవారం నాడు మేడారం జాతరకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని అమ్మవార్లను కోరుకున్నట్లు వెల్లడించారు. గతంలో తాను కోరుకున్న కోర్కెలను అమ్మవారు తీర్చారని.. ఇప్పుడు కూడా తన కోరికను అమ్మవార్లు తీరుస్తారని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా సమ్మక్క…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎగుమతి అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని చంద్రబాబు తోక పత్రికలో రాశారని… రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును సీఎం చేసేవరకు ఆయనకు తోకలుగా ఉన్న పార్టీలు, తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని…
ఏపీలో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు నెలకొన్నాయి. ఎక్కువగా గ్రామాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ రెండు గంటల నుంచి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీలో చిన్న చిన్న విద్యుత్ కోతలు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ వాటిని ప్రతిపక్షాలు భూతద్దంలో చూపుతున్నాయని ఆయన ఆరోపించారు. గత…
అమరావతిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోని 20 అనుబంధ విభాగాల బలోపేతంపై చర్చించారు. పార్టీ అనుబంధ కమిటీల పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగి ఉపయోగం లేదన్నారు. Read Also: Andhra Pradesh: అండర్-19 క్రికెటర్‌పై ఏపీ సీఎం…
నిజామాబాద్ పర్యటనలో బీజేపీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ నేతలు యువకులు, విద్యార్థులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడేళ్లు దాటుతున్నా తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేయలేదన్నారు. బీజేపీ నేతలు విషం చిమ్మకుండా విషయాలు…
ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీలిచ్చే పనిలో పడ్డాయి. తాజాగా యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కొత్త హామీని ప్రకటించింది. మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు ఉచిత రేషన్‌తో పాటు పేదలకు కిలో నెయ్యి ఇస్తామని ప్రకటించారు. పేదల…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేదని హరీష్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్న భాషనే కేసీఆర్ ఈరోజు మాట్లాడుతున్నారని.. తెలంగాణ ప్రజల భాషనే కేసీఆర్ మాట్లాడతారని తెలిపారు. బీజేపీ నేతలదే మతాల మధ్య చిచ్చు పెట్టేలా భాష అని ఆరోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కూకటివేళ్లతో కదిలించి తెలంగాణను సాధించారని హరీష్‌రావు…
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉంటాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని ఉద్యమం చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. జీవీఎల్ నరసింహారావు పక్క రాష్ట్రంలో ఎంపీ పదవి తెచ్చుకున్న వ్యక్తి అని.. పదిహేను రోజులకు…
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పిలుపు మేరకే తాను ఈరోజు ఆయనతో సమావేశం అయ్యానని తెలిపారు. పదవుల కోసం రాలేదని స్పష్టం చేశారు. అయితే త్వరలో పార్టీ ఆఫీసు నుంచి తనకు సంబంధించి ప్రకటన ఉంటుందని అలీ తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో తనకు పాత పరిచయం ఉందని.. వైసీపీ పార్టీ కోసం తాను కష్టపడి…