మంత్రి వర్గం కూర్పు ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చివరి నిమిషంలో సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. అయితే రాజీనామాల ఆమోదంపై మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వెలువడనుంది.
దీంతో పాటు కొత్త మంత్రుల జాబితా తన వద్దకు రాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపనున్నారు. ఇదిలా ఉంటే.. ఎవరిని మంత్రి పీఠం వరిస్తుందోనని ఆశావహులు ఉత్కంఠలో ఉన్నారు. ఏ ఫోన్ వచ్చినా ఎమ్మెల్యేలు ఆతృతగా చూస్తున్నారు. హైకమాండ్ ఫోన్ కోసం టెన్షన్‌లో ఎమ్మెల్యే ఉన్నారు. అంతేకాకుండా ఆశావహులు ఇళ్లకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. అయితే మరికొందరు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇంటికి ఉదయం నుంచే క్యూకట్టడం విశేషం.
https://ntvtelugu.com/home-loan-emi-calculator/