ఏపీ సీఎం జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టేందుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ విస్తరణతో పాటు ఏపీలో అభివృద్ధి పనులపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. మా పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు మేం చేయలేక పోతే మీరు వచ్చి చేయవచ్చు కదా అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ నేతలు కబుర్లు కాదు కేంద్రం నుండి డబ్బులు…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో వర్గవిభేదాలు బయటపడ్డాయి.. మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆధ్యక్షరాలు ఎంపీ మాలోత్ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కొని మాట్లాడారు. బిత్తరబోయిన కవిత కిందకూర్చోని పక్కన వున్న ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావుకి చెప్పారు. అంతేకాకుండా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన అనగానే… పక్కనే ఉన్నా…
ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈసారి జాతీయ పార్టీ జెండా ఎగురుతుందా? కానీ టీఆర్ఎస్ పార్టీని చిత్తు చేసే సత్తా ఎవరికి ఉంది? గులాబీ దళాన్ని మట్టికరిపించే దమ్ము తమకే ఉందని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కాంపిటీషన్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల పంజాబ్లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం సంక్లిష్టంగా ఉంది. అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు…
గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముద్ర గతంలో ఎన్నడూ లేనంత అల్ప స్థాయికి పడిపోయింది. దాంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన రాజకీయ పార్టీ తన జాతీయ ప్రాముఖ్యతను కోల్పోతోందని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల విస్తరణతో దశాబ్దాలుగా భారత రాజకీయాలపై గల తన ఆధిపత్య శక్తిని కోల్పోతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ…
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు బహిరంగ లేఖ రాశారు. నిమ్స్ లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ల సమస్యలు పరిష్కరించాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. 423 మంది స్టాఫ్ నర్సులు పది రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. ఇది దుర్మార్గమని ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి సెలవులు నుంచి జీతాల పే స్లిప్ ల వరకు…
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఉగాది పర్వదినం రోజు కూడా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై…
హనుమకొండ జిల్లాలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో మా మహిళ మంత్రి కనబడ లేదా..? అని ఆయన ప్రశ్నించారు. మా జిల్లా మంత్రులు కనిపించలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆహ్వాన పత్రికల్లో మా మంత్రుల పేర్లు ఎందుకు పెట్టలేదని, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ధాన్యాన్ని పంది కొక్కుల లెక్క బుక్కారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్లో రైస్ మిల్లర్లతో కవిత కుమ్మక్కు అయ్యిందని ఆయన ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ధాన్యం కొనుగోలు పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు డబ్బులు ఇస్తా అని కోట్లు వసూలు చేసింది కవిత అని, ఆ డబ్బులు ఏమయ్యాయి చెప్పు…
Congress Leader Madhu Yashki Goud Fired on Minister KTR. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు నువ్వానేనా.. అనే విధంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డాగా మారిందని, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారిందన్నారు. తమ్మీ తారక రామారావు… 50 యెండ్లలో ఏం చేసింది కాంగ్రెస్ అంటున్నావు.. కాంగ్రెస్ ఐటీకి హైదరాబాద్ నీ హబ్ గా చేసింది…
1.ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక…