డా.బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా నేడు తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని.. భారత ప్రజలను, అంబేద్కర్‌ను సీఎం కేసీఆర్ అవమానించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్‌కు సామాజిక స్పృహ లేదని, జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచొచ్చని ఆయన వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్లు కేసీఆర్ తగ్గించారని మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని అనుకుంటున్న ఈ ప్రభుత్వం కి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. అంబేద్కర్ ని ప్రపంచం గుర్తించింది కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం గుర్తించలేదని, చెప్పి 8 ఏళ్ళు అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత ద్రోహి అని, ఓట్ల కోసమే దళిత బంధు అని ఆయన వ్యాఖ్యానించారు.