కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి 11 సమస్యలపై వినతి పత్రాన్ని ఎంపీలు అంజేశారు. “గ్రామీణ ఉపాధి హామీ పథకం” కింద రూ. 2828 కోట్ల నిధులు బకాయిలు విడుదల చేయాలని, ఏపీకి కేటాయించిన గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద మొత్తం 30 కోట్ల పని దినాలుకు పెంచాలని కోరారు. “ఉపాధి హామీ పథకం” కింద గిరిజన ప్రాంతాలలో కాఫీ…
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ భేటీకి సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశానికి తాను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా రాలేకపోతున్నానని, అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క…
TDP MLC Ashok Made Comments on CM Jagan. చీప్ లిక్కరును కాస్ట్ లీ ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్న సీఎం జగన్ తాజాగా కాస్ట్ లీ కరెంట్ పథకం అమలుకు సిద్ధమయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం మార్చిన విద్యుత్ శ్లాబులతో 75యూనిట్ల కేటగిరిలో ఉన్నవారు నిన్నటివరకు రూ.169 కడితే, రేపట్నుంచి రూ.304 కట్టాలని, నెలనెలా కేటగిరీలు మారుస్తూ.. 13 శ్లాబుల్ని 6 శ్లాబులుగా…
Andhra Pradesh Deputy CM Amzath Basha about AP Cabinet Expansion. ఏపీ మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్తీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ పై డిప్యూటీ సీఎం అంజాద్ బాష ఎన్టీవితో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం నాకు శిరోధార్యం అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మైనారిటీ ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడమే గొప్ప అదృష్టం గా భావిస్తున్నాని ఆయన అన్నారు. సీఎం…
సామాన్యులకు అధికారం లేకుండా చేసిన దుర్మార్గ పార్టీ టీఆర్ఎస్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ధర్మాన్ని చెరబట్టలనే చూసే పార్టీ టీఆర్ఎస్ అని, ధర్మం నిజమైతే వేల కోట్లు రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయే కేసీఆర్ చెప్పాలన్నారు. సిద్దిపేటలోని కేసీఆర్ భూమి అమ్మి ప్రజలకు ఇవ్వడం లేదు మన సొమ్ము మనకే ఇస్తుండని ఆయన విమర్శించారు. 24గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు పంట…
టీడీపీ 40 వసంతాల వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై కీలక ప్రసంగం చేశారు. ఆనాడు పార్టీ ప్రకటన కోసం ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు అతికొద్దిమందితోనే ఎన్టీఆర్ వచ్చారని.. కానీ ఎన్టీఆర్ నుంచి ప్రకటన రాగానే వేలాది మంది తరలివచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనే ఓ బెంచ్ మార్కును సృష్టించిందని తెలిపారు. 40 ఏళ్ల…
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని టీడీపీ అంటోందని.. అంటే తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా అని ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కామెంట్లకు వైసీపీ నేతలు భయపడాల్సిన అవసరం…
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఇది అప్పట్లో ఓ రికార్డు. ఎందుకంటే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చింది. ఆ సమయంలో బీజేపీ ఉన్నా ఆ పార్టీకి బలం లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆవిర్భావం…
Union Minister Kishan Reddy Fired on CM KCR over SC, ST Reservations and Paddy Procurement. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఎన్టీవీ చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన కేంద్రం అభ్యంతరం చెప్పదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు…
టీడీపీ స్థాపించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1983లో కాంగ్రెస్ వ్యతిరేక గాలిలో కమ్యూనిస్టులకు రావాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ తన్నుకుపోయారని నారాయణ వెల్లడించారు. ప్రపంచంలో రాజకీయ పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన నేత ఎన్టీఆరేనని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయ నేతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నారు. ఇప్పడున్న…