కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు అంటుంటే.. ఇవ్వలేదని టీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధర్నా చేసే అధికారం టీఆర్‌ఎస్‌కి మాత్రమే ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు. సకుటుంబ సపరివారంగా ఢిల్లీలో ధర్నా చేస్తే మేమేమి అడ్డుకోలేదు కదా.. అని ఆయన ప్రశ్నించారు. ప్రతి రోజు ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు డ్రైనేజీ నీరు తాగాల్సిన పరిస్థితి… 80 శాతం ఆదాయం ఇక్కడ నుండే వస్తుందని ఆయన మండిపడ్డారు.
రేషన్ బియ్యంలో కిలో 29 రూపాయల సబ్సిడీ ఇస్తున్నామని, కేంద్రం.. కేసీఆర్ జేబులో పెడితేనే ఇచినట్టా అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. దళిత విద్యార్థులకు ఈ రోజు వరకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదు… వాళ్ళ ఖాతాలకు నేరుగా పంపిస్తామంటే ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.. కాలేజీలకు ఇవ్వాలని అంటుందన్నారు. వివక్ష కేంద్రానిది కాదు…మీది వివక్ష అంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లేకుండా ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ ఎలా నడుస్తుందని ఆయన ప్రశ్నించారు.