పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి ఒప్పించాలిసింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులుకు గురి చేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గౌరవెల్లి ప్రజలు ప్రాజెక్ట్ కి సహకరిస్తామని చెప్పారని అయినా.. అర్థరాత్రి వందలాది మంది పోలీస్ లు ఇళ్ళ నుండి ఈడ్చుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారని ఆయన మండిపడ్డారు. నిర్వాసితులపై పోలీసుల లాఠీ ఛార్జీ దారుణమని, గతంలో కూడా రాత్రికి రాత్రే వీరిపై దాడి చేసి రోడ్ మీద పడేశారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాము అని చెప్పడం వాళ్లు ఒప్పుకోకపోవడంతో అర్థ రాత్రి వందలాది మంది పిల్లలు చిన్న పెద్ద ముసలి తేడా లేకుండా విచక్షణ రహితంగా కొట్టారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బాధలు వినమని సీఎం ను కోరామని, మా తాత ముత్తాత ఆస్తి సెంటిమెంట్ పక్కన పెట్టీ సహకరిస్తామని చెప్పిన దానికి తగినట్లు ఆదుకోమని అడిగితే వారి బాధలు వినకుండా దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పోలీసులు కలిసి దాడి చేశారన్న బండి సంజయ్.. సీఎం స్పందించాలి. ముఖ్యమంత్రి స్పందించక పోవడానికి అంత పీకుడు పని ఏముంది అని వ్యాఖ్యానించారు. నీ ఫార్మ్ హౌజ్ కు ఫ్రీ కరెంట్, కాళేశ్వరం నీళ్లు. నీ ఫార్మ్ నుంచి జానెడు జాగా ఎవరికి ఇవ్వవు ప్రజల ఆస్తులు ఎలా తీసుకుంటావు? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి మూడింది అందుకే పేద వాళ్ళని ఇబ్బందీ పెడుతున్నారంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇబ్బందీ పడే వాళ్లను పిలిచి మాట్లాడి ఆ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.