మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబ తాటాకు తప్పుళ్ళకు భయపడమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడిగా కేసీఆర్ ఊహించుకుంటున్నాడని, ఫాంహౌస్ లో కూర్చుని కేసీఆర్ కంటోన్న కలలు కల్లలుగా మిగిలిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు.. దేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీని కేసీఆర్ పొగుడుతాడని ఎవరు అనుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారని, కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదిగటం తప్పులేదు.. కుటుంబ పార్టీలకు అండగా ఉంటారా? దేశాన్ని కాపాడేవారికి అండగా ఉంటారనేది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో ట్రైబల్ మ్యూజియం పనులు మెదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కనీసం స్థలం కూడా కేటాయించలేదని ఆయన విమర్శించారు. జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించే అవకాశం ఉందని, అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.