YSRCP: కర్నూలు జిల్లా వైసీపీలో బయటపడ్డ లుకలుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గానికి చెందిన 20 మంది కార్పొరేటర్లు ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశమైన తర్వాత కౌన్సిల్ మీట్‌కు వెళ్లకూడదని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదని మేయర్ బీవై రామయ్యపై కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వర్గం కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అందుకే పనులు జరగడం లేదంటూ మేయర్ బీవై రామయ్య వర్గీయులు చెప్తున్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో హాజరైన కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు ప్రతిపక్ష పాత్ర వహించారు.
అటు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎటువంటి సమాచారం లేకుండా అధికారులు శానిటరీ ఇన్‌స్పెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేశారని కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 52 వార్డులు ఉన్నాయి. పాణ్యం 16, కోడుమూరు 3, కర్నూలు 33 వార్డులు ఉండగా.. 25 మంది వైసీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!