Harish Rao : బీజేపీ నేతలు.. ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి మీ ముఖం చూపియండంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బాయిల కాడ మోటారు పెడితే 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని, కానీ సీఎం కేసీఆర్ బాయికాడ మోటార్లను పెట్టేది లేదని, రైతులకు కష్టం తెచ్చేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారన్నారు.
ఎఫ్‌సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఎఫ్‌ఆర్‌బీఎం నిధులను కావాలనే కేంద్ర ప్రభుత్వం ఆపివేసిందన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయకుండా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడితే బీజేపీపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ అని ఆయన మండిపడ్డారు.
Also Read
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని బీజేపీ ఆపేసిందని, వరంగల్ కు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు తీసుకెళ్లింది బీజేపీనేనని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని, తెలంగాణలో ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఖాళీగా లేకుండా అన్నీ భర్తీ చేస్తామన్నారు. వందలాది దరఖాస్తులు పెట్టుకున్నా.., మెడికల్ కళాశాలలు, నవోదయ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు కాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!