PM Modi: భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు.
కవిత ఎవరో నాకు తెలియదు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కోట్లాడుతాం అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను…
అమెరికా అధ్యక్షుడు టెర్రరిజాన్ని వ్యతిరేకించారు.. కానీ పాకిస్తాన్ ను తప్పుబట్టలేదు అని నారాయణ పేర్కొన్నారు. ట్రంప్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా.. భారత ప్రధాని ఒక్కమాట మాట్లాడడం లేదు.. ట్రంప్ నేనే ఆపాను యుద్ధాన్ని అంటాడు.. మన ప్రధాని నోరు తెరవడు.. ఎందుకంత భయం.. బానిస లాగా ఎందుకు భావించడం అని అడిగారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 19న తన 55వ పుట్టినరోజును అత్యంత సరళంగా జరుపుకున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. రాహుల్ తన నివాసం 24 అక్బర్ రోడ్లో కార్యకర్తలు, నాయకులను కలిశారు. అక్కడ వాళ్లు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడానికి నిరాకరించారు.
CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది. Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న…
ఏపీ వైసీపీ నేత కొడాలి నాని లేటెస్ట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఆయన ఛాతికి బెల్ట్ ధరించి ఉన్నారు. హార్ట్ సర్జరీ తర్వాత నాని బయట ఎక్కడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నానికి సంబంధించిన ఈ ఫొటో బయటకు రావడంతో వైరల్ అవుతోంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయనకు ఆపరేషన్ జరిగింది.
అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
Mahesh Goud : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్‌లో మంత్రివర్గ విస్తరణపై స్పందించిన ఆయన, ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సమీకరణాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారెంతైనా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఆలస్యం జరుగుతోందని అసహనం వ్యక్తం…
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు ‘‘కుల గణన’’ చేస్తామని బుధవారం సంచలన ప్రకటన చేసింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కేంద్రం తలొగ్గిందని, కుల గణనకు అంగీకరించిందని ఆయన అన్నారు.
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో పార్టీకి నిలబడి ధైర్యంగా పోరాడిన ప్రజాప్రతినిధులందరికీ సెల్యూట్ చేస్తున్నానని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయని, ప్రజలు అత్యంత కష్టాల్లో ఉన్నారని ఆయన ఆరోపించారు. “ఇది దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన. ప్రజావ్యతిరేకతను ఎంత అణిచివేయాలనుకున్నా సాధ్యం కాదు” అని…