బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశి, మథుర, హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు.
RS Praveen Kumar : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాక్షస, రాబందుల పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మీద 83 కేసులు ఉన్నప్పటికీ, ఆయన సీఎం, హోంమంత్రి హోదాలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి బాధితుడు, ఫిర్యాదుదారుడు, హోంమంత్రి, జైలు సూపరింటెండెంట్, తలారీ.. ఇలా అన్నీ ఆయనే అయ్యాడు” అని…
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు…
జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్రం, కొన్ని రాష్ర్ట ప్రభుత్వాల మధ్య వివాదం సాగుతున్న విషయం విదితమే. తాజాగా వీటిని వ్యాతిరేకిస్తూ.. తమిళగ వెట్రి కళగం పార్టీ తీర్మానాలు చేసింది. శుక్రవారం తిరువన్మయూర్లో వియజ్ ఆధ్వర్యంలో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. ఈ సమావేశానికి హాజరైన విజయ్ ప్రసంగించారు.
బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుంచి చెబుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యిందన్నారు. నేడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేల తో స్క్రిప్ట్ రాసి చదివి వినిపిస్తున్నారని ఆరోపించారు.
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు జ్యూడిషియల్ వ్యవహారాలపై మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పినా, సీఎం సభలో కోర్టును ధిక్కరించి మాట్లాడారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో ఎలాంటి పరిణామాలు జరగలేదని, ఇప్పుడు కూడా ఏమీ కాదని సీఎం సభలో వ్యాఖ్యానించారని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ కాదని చెప్పడం ద్వారా సీఎం తన పరిధిని దాటి సుప్రీంకోర్టు పై మాట్లాడారని…
గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ తనని అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఏమి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. "మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం" అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. పోలీసుశాఖతో పెట్టుకోవద్దు.. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటనే…
Kishan Reddy : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగంలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు పోటీపడి మాట్లాడిన తీరు, దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం, వారి అసలు ఉద్దేశ్యాన్ని…
Supreme Court : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులపై ఎటువంటి స్పందన రాకపోవడంతో, కోర్టు మరోసారి ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ ఈ నెల 25న సుప్రీంకోర్టులో జరగనుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి, 10 మంది…
BRS vs Congress: తెలంగాణ శాసన మండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జూపల్లి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి, ఫలితంగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. మంత్రి జూపల్లి తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను ప్రస్తావిస్తూ, “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అంతో ఇంతో ఉంది. పూర్తిగా లేదనడం…