బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ చంద్ర రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాజా సింగ్ మా ఎమ్మెల్యే.. పార్టీ రాజా సింగ్ తో మాట్లాడుతుందని తెలిపారు. “కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు అని అనుకుంటా. గౌతం రావు బీజేపీలో కొత్త వ్యక్తి కాదు.. రామ చందర్ రావు రాజా సింగ్ తో మాట్లాడారు.. పార్టీ లోని అందరితో మాట్లాడిన తర్వాత అభ్యర్థిని ప్రకటించడం జరిగింది.. 30 సంవత్సరాలు ఏబీవీపీలో పని చేశారు.. గత 15 సంవత్సరాలుగా బీజేపీలో పని చేశారు. మజ్లిస్ పార్టీ కి వ్యతిరేకంగా బీజేపీ మొదటి నుండి పోరాటం చేస్తూ వస్తుంది..” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: AP Secretariat: ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నాం: హోంమంత్రి
ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలికేది ఎంఐఎం పార్టీ అని రామ చంద్ర రెడ్డి తెలిపారు. ఆ పార్టీ కోసం కాంగ్రెస్, బీర్ఎస్ లు చేతులు ఎత్తేశాయన్నారు. మతోన్మాద మజ్లిస్ కు వ్యతిరేకంగా అందరం ఒకటవుదాం అని పిలుపునిచ్చారు. ఎంఐఎంకి వత్తాసు పలుకుతున్న వారిని.. ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.. రాజకీయాలకు అతీతంగా బీజేపీ అభ్యర్థికి మద్దతు పాలకాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాజా సింగ్ విషయం లో పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు.
READ MORE: BJP MLA Raja Singh: “మీకు గులాం గిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్లు”.. సొంత పార్టీపై రాజాసింగ్ ఫైర్