కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరైనట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ అంశంపై తాజాగా వీహెచ్ స్పందించారు. "ఒకరిద్దరికి కోపం రావచ్చు. నిన్న మీటింగ్ లో సీఎం నీ.. ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు. జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అన్నారు. దాని మీద…
Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది SLBC టన్నెల్ ప్రమాద ఘటన. గత నాలుగు రోజులుగా సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘటనాస్థలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి తదితరులు సహాయక…
KTR : తెలంగాణలో ఇటీవల జరుగుతున్న మిస్టీరియస్ మరణాల (Mystery Deaths) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులపై బోరింగ్ ప్రసంగాలు ఇస్తూ, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర పాలన నిర్వహించే బాధ్యత తనపై ఉందన్న విషయాన్ని మరిచిపోయి, అసంబద్ధ ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. “ఒక ముఖ్యమంత్రి (Chief Minister) లాగా మాట్లాడాలి కానీ,…
సత్యవర్ధన్ కిడ్నాప్ వివాదం కేసులో కీలక ఆధారాలతో వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. వైసీపీ అధికారిక x ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రూత్ బాంబ్ పేరిట ఎక్స్‌లో వైసీపీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం అంటూ ఆ వీడియోను జత చేసింది.
Krishna Mohan Reddy : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఫొటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలపై చూసి హైరానా పడ్డారు. “ఏమిటీ! నా అనుమతి లేకుండా నా ఫొటో పెట్టారు? నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేశారు!” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను చూసి బాధపడటమే కాక, వాటిని పెట్టిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తోంది. “నేను కాంగ్రెస్ లో చేరానా, లేదా మరి ఫొటో మాత్రం చేరిపోయిందా?” అని ఆయన ముక్కు…
CM Revanth Reddy : ప్రధాని మోడీతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోడీకి ఐదు అంశాలపై విజ్ఞప్తులు ఇచ్చానని, మెట్రో విస్తరణ, మూపీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్, ఏపీఎస్ కేడర్ల పెంపు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధానికి ఇవ్వాల్సిన విజ్ఞప్తులు ఇచ్చాను, బాధ్యత వహించి వాటిని తీసుకురావాల్సింది కేంద్ర మంత్రులు…
Aadi Srinivas : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశామని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారని…
Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫోన్ టాపింగ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. వీరు చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు పంపుతూ డబ్బులు…
V.Hanumantha Rao : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వి.హెచ్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దుర్వినియోగంతో పాటు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ, అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీహెచ్ మాట్లాడుతూ, 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేసి, మార్చి 24న…
Jogu Ramanna : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుమారు 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే ను నిర్వహించింది. ఈ సర్వేను ప్లానింగ్ కమిషన్ఆ ధ్వర్యంలో రూపొందించి, ఆ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంతో పాటు, అసెంబ్లీ సైతం ఆమోదం తెలిపింది. ఫలితంగా, ఈ నివేదిక అధికారికంగా అమలులోకి వచ్చింది. అయితే, ఈ కుల గణన సర్వే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సర్వేలో “ముస్లిం బీసీలు ” అనే…