ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీబీ ఓఎస్డీ (OSD) రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 328, 316, 31(పీడీపీపీ) సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా.. ఘటన జరిగిన రోజే పీసీబీ ఉద్యోగులు నాగరాజు, రూపేంద్ర మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓఎస్డీ రామారావుపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. గతంలో నమోదు 106 సెక్షన్ ను మార్చి కొత్తగా అదనపు సెక్షన్లను కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పీసీబీ, ఫోరెన్సిక్ శాఖల సాయంతో ఫైల్స్ లో ఏముందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఫైల్స్ దహనం కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవటంతో విచారణ చేపట్టింది. వివరాలు ఎప్పటికప్పుడు ఎస్పీ నయీం అస్మి డీజీపీకి తెలియజేస్తున్నారు.
Read Also: Tollywood: టాలీవుడ్లో విషాదం.. లేడీ యువ నిర్మాత ఆత్మహత్య.. పురుగులు పట్టేసిన స్థితిలో శవం?
కాగా.. ఇంతకుముందు పీసీబీ ఫైల్స్ దహనం కేసు విచారణలో ఓఎస్డీ రామారావు పోలీసులకి చుక్కలు చూపించాడు. రెండు రోజులుగా రామారావును విచారించారు. మరోవైపు.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లో కొన్ని పీసీబీ వెబ్ సైట్ లో ఓపెన్ డాక్యుమెంట్స్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక.. దహనం చేసేందుకు ప్రయత్నించిన ఫైల్స్ లో కీలకమైనవి ఏమన్నా ఉన్నాయా అనే గుర్తించే పనిలో పడిపోయారు. ఇందు కోసం పీసీబీలో ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం కేసు కలకలం రేపింది. కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపంలోని కరకట్ట రోడ్డు మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన పత్రాలను దగ్ధం చేసిన విషయం తెలిసిందే.. అయితే, పోలీసులు డ్రైవర్ నాగరాజుని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో.. కీలక విషయాలు బయటపెట్టాడు.
Read Also: Rich Thief: ఈ దొంగ మామూలోడు కాదు.. ముంబైలో ఫ్లాట్, ఆడి కారు.. షాక్‌లో పోలీసులు!