విశాఖలో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో ఓవైపు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసుకు కేంద్ర బిందువుగా మారిన ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. కిడ్నీ రాకెట్ కేసులో తీగలు లాగితే డొంకలు కదులుతున్నాయి. బాధితుడు వద్ద నుంచి రూ. 27 లక్షలకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు డీల్ కుదుర్చుకొని అడ్వాన్స్ గా పది లక్షలు వసూలు చేసి చీటింగ్ చేసారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ వాణి, కోఆర్డినేటర్ అనిల్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యి సస్పెండ్కు గురవుగా.. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Manish Sisodia: మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్ తో కేసు మరో మలుపు తిరిగింది. కిడ్నీ ఆపరేషన్ కోసం వసూలు చేసిన హాస్పిటల్ కోఆర్డినేటర్ అనిల్కు హాస్పిటల్కు ఎటువంటి సంబంధం లేదని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హాస్పిటల్లో పనిచేసిన అంత మాత్రాన హాస్పిటల్ కి ఏంటి సంబంధం అని అంటున్నారు యాజమాన్యం. అనిల్ ఆర్థిక లావాదేవీలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, అనిల్ పాత్ర పై తమకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 10 లక్షలు కాజేసి బాధితుడిని బురిడీ కొట్టించాలనుకున్నాడు కోఆర్డినేటర్ అనిల్. ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టిన తాము సిద్ధమే అని క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ మేనేజర్ హరి ప్రసాద్ తెలిపారు.
OSD Rama Rao: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావుపై కేసు నమోదు..