Nagarjuna Sagar: నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఇవాళ అధికారులు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
చైనాలో ఒక యువతి (20) తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. కుమార్తె తీరుపై నిఘా పెట్టేందుకు తల్లిదండ్రులు ఆమె బడ్ రూంలో స్పై కెమెరాను ఏర్పాటు చేశారు.
ఉగ్రవాదులను అంతమొందించేందుకు పోలీసులు సరికొత్త టెక్నాలజీ తీసుకురానున్నారు. రాత్రి వేళల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. సహచరులను గుర్తించేందుకు, శత్రువులను కచ్చితంగా టార్గెట్ చేసేందుకు ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఐదు వేల వ్యూహాత్మక సామగ్రిని పోలీసులు కొనుగోలు చేయనున్నారు. ఇందులో వెయ్యి ఇన్ఫ్రారెడ్ లైట్ లేజర్లు, 4 వేల ఇన్ఫ్రారెడ్ ప్యాచ్లు ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ లేజర్ రాత్రిపూట 800 మీటర్ల దూరం వరకు శత్రువును చూస్తుంది.
Fake Documents: ఏలూరు జిల్లాలోని నూజివీడులో నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఠా ప్రయత్నం చేసింది. ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టికి వెళ్ళటంతో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 66- 2 సర్వే నెంబర్ గల భూమికి 25. 46 ఎకరాలను నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కు ముఠా తెగబడింది.
Shamshabad Airport Cab Drivers Protest: తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ లు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్ట్ లో ఇతర రాష్ట్రాల క్యాబ్ లు నడపడం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వారు. వేలాది క్యాబ్ లను పార్కింగ్ లో నిలిపివేసి క్యాబ్ డ్రైవర్స్ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరిమించేది లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎయిర్ పోర్ట్ వద్ద…
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జిపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
AP Home Minister: విశాఖపట్నంలో నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి నివారణ మీద సమీక్ష చేపట్టినట్లు తెలిపారు.