Atmakur Tragedy: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో కిడ్నాప్ కు గురైన ఇంటర్ విద్యార్థి లభ్యమైంది. ప్రేమ వ్యవహరంలో మూడు రోజుల క్రితం కాలేజీలో ఉన్న ఇంటర్ విద్యార్థి వాహిద్ ను నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. మూడు రోజులుగా వాహిద్ కనిపించకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడి కోసం పోలీసుల గాలిస్తున్న నేపథ్యంలో ముగ్గురు యువకులను అదుపులోకి విచారించారు.
అయితే, వాహిద్ అనూహ్యంగా ఆత్మకూరు శివారులోని ఓ బావిలో శవమై కనిపించాడు. యువకుడిని కిడ్నాప్ చేసిన వాళ్లే హత్య చేశారా.. లేక ఆత్మ హత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వాహిద్ తన స్నేహితురాలిని ప్రేమిస్తున్న విషయం తెలియడంతో వాహిద్ ను బాలిక కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. ఇక, వాహిద్ ను కొట్టి వదిలేశామని, చంపలేదని బాలిక బంధువులు చెప్పినట్టు సమాచారం. కిడ్నాప్ చేసి కొట్టారని మనస్తాపంతో వాహిద్ ఆత్మహత్య చేసుకున్నారనే మృతుడి తల్లిదండ్రులు మరో వైపు వాదిస్తున్నారు.