Papua New Guinea: పపువా న్యూగినియాలో సాయుధ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. దేశంలోని ఉత్తర ప్రాంతంలోని మూడు గ్రామాల్లో దాదాపు 26 మందిని ఈ గ్యాంగ్ చంపేసినట్లు ఐక్యరాజ్య సమితితో పాటు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్‌కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది.
అక్క తమ్ముడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్‌లో జరిగింది. తమ కోసం వెతకవద్దని చెప్పి తమ్ముడిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయింది అక్క. వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కాలా మండలంకు చెందిన వారిగా గుర్తించారు. గచ్చిబౌలిలోని మజీద్ బండ ప్రభుపాద లేఅవుట్లో తన మేనమామ నరేష్ వద్ద నివాసం ఉంటున్నాడు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.. బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.. 11 కేవీ మెయిన్ లైన్ తీగలు కావటంతో తెగి బైక్ పై పడగానే బైక్ తో పాటు పూర్తిగా ముగ్గురు యువకులు సజీవ దహనమయ్యారు.
తమిళనాడు పోలీసులు ఆరుగురు రష్యా పౌరులను అరెస్ట్ చేశారు. కుడంకుళం వద్ద ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ దగ్గర నుంచి ఆరుగురు రష్యన్ పౌరులు, ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. న్యూక్లియర్ రియాక్టర్ పరిసరాల్లో విదేశీయులు ఉన్నారని స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వడంతో సోమవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు IANSకి తెలిపారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌గా గుర్తించారు పోలీసులు. అతను విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో సమస్యలతో డిప్రెషన్లో ఉరేసుకొని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.