Vizianagaram SP: విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని ముగడ కాలనీలో దారుణం జరిగింది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు గద్దె కృష్ణవేణిని దొంగలు దారుణంగా చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, వృద్దరాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.
Basheerbagh Crime: షాద్నగర్ లో దళిత మహిళా పై థర్డ్ డిగ్రి ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. కుమారుడి జాడ చెప్పాలని.. లేకుంటే తుపాకీతో కాల్చిచంపుతానని...
Atmakur Tragedy: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో కిడ్నాప్ కు గురైన ఇంటర్ విద్యార్థి లభ్యమైంది. ప్రేమ వ్యవహరంలో మూడు రోజుల క్రితం కాలేజీలో ఉన్న ఇంటర్ విద్యార్థి వాహిద్ ను నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు.
ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ ను జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (స్పెషల్ డీజీ)గా నియమితులయ్యారు. సెప్టెంబరు 30న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ తర్వాత ఆయన దళం చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులకు దిగింది. అస్సాంలో 19 చోట్లు బాంబులు పెట్టినట్లుగా నిషేధిత తిరుగుబాటు గ్రూపు ఉల్ఫా-ఐ బెదిరించింది. మిలిటెంట్ గ్రూప్ బెదిరింపులతో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి.
Murder Case: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కిపురం (మం) మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోబుల్ జార్జ్ గుడిమెల్లంక గ్రామానికి చెందిన భర్తను వదిలేసిన రాపాక ప్రశాంతి (వివాహిత)తో ప్రేమలో పడి గత కొంతకాలంగా సహజీవనం కొనసాగించారు.
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువ రైతు మహేశ్వర్ రెడ్డి(48), ప్రశాంతి(35) అనే దంపతులు అప్పుల బాధ తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు రూ.2.5 కోట్లు దాకా అప్పు చేశారు. సదరు దంపతులకు నిఖిల్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు.
జార్ఖండ్లోని హజారీబాగ్లోని ఒక ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. తన దగ్గరున్న ఇనుప రాడ్తో ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి డజను జింకలను వేటగాళ్లు చంపేశారు. ఈ ఘటనపై సోమవారం సీనియర్ అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చోహ్తాన్ సర్కిల్ ఆఫీసర్ కృతికా యాదవ్ తెలిపారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.