Vikarabad Crime: షాద్‌నగర్ లో దళిత మహిళా పై థర్డ్ డిగ్రి ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. కుమారుడి జాడ చెప్పాలని.. లేకుంటే తుపాకీతో కాల్చిచంపుతానని ఎస్ఐ బెది రిస్తున్నాడని ఓ దళిత మహిళ వాపోయింది. మూడు నెలలుగా తనను స్టేషను పిలిపించి చిత్రహింసలు పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన వికారబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్..
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన లోహడ నరేష్ కాశీంపూర్ గ్రామానికి మేస్త్రీ పనికోసం వెళ్లి అదే గ్రామానికి చెందిన బాలిక(16)ను ప్రేమించాడు. ఇద్దరూ దళితులే. కొన్ని నెలలు ప్రేమించుకున్న వీరు మే 2న ఇళ్లలోంచి వెళ్లిపోయారు. తన కూతురిని నరేష్ కిడ్నాప్ చేశాడని యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నరేష్ తల్లి లోహం కళావతిని ఎస్ఐ రమేష్ కుమార్ స్టేషన్‌కు పిలిపించాడు. కుమారుడి జాడ చెప్పాలంటూ ఎస్ఐ బూతులు తిట్టాడని కళావతి వాపోయింది. కాల్చి చంపి పేపర్ లో ఆ వార్త వేయిస్తానని బెదిరించాడని తెలిపింది.
Read also: Vinesh Phogat: కోర్టు తీర్పుపై వినేష్ ఫోగట్ పోస్ట్ వైరల్..
నరేష్ ఆచూకీ తెలిసే వరకు రోజూ స్టేషన్ కు రావాలని హుకుం జారీ చేశాడని చెప్పింది. దీంతో 3 నెలలుగా ఉదయం వచ్చి రాత్రి వరకూ రాణా లోనే కూర్చొని.. ఇంటికి పోతున్నానని వెల్లడించింది. కూలి పనులపై బతికే తాను రోజూ స్టేషన్‌కు వస్తుండటంతో పూట గడవడం కష్టంగా మారిందని వాపోయింది. ఎస్ఐ పలుమార్లు చేతులు, కాళ్లపై లాఠీతో కొట్టడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని కన్నీటి పర్యంతమైంది. కళావతి కన్నీటి గాధతో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. దళిత మహిళా కళావతి పై దాడి చేసిన ఎస్ఐ రమేశ్‌తో పాటు సిబ్బంది పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
Read also: ఎర్ర చీరలో నిమ్మపండు లాంటి అందం.. జాన్వీ లుక్స్ అదుర్స్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో పోలీసులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదు చేశారు అధికారులు. ఇప్పటికే డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన విషయం తెలసిందే.. ఇప్పుడు మరో దళిత మహిళపై ఎస్ఐ రమేష్ కుమార్ చిత్ర హింసలకు గురిచేశాడనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.
OTT Movies : థియేటర్లలో రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా..