పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ఇ-పహారా అప్లికేషన్ ను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ప్రారంభించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది.. మదనపల్లెలోని నవోదయ కాలనీలో అర్ధరాత్రి వీరంగం సృష్టించిందట ఓ గ్యాంగ్.. అయితే వారిని వారించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కాల్పులు జరపడం సంచలంగా మారింది.
Tihar Jail: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్న తీహార్ జైలులో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల మధ్య గొడవ జరగడంతో.. ఓ ఖైదీ పదునైన ఆయుధంతో తోటివారిపై దాడికి దిగడంతో.. ఇద్దరు ఖైదీలు గాయపడినట్లు జైలు అధికారులు ఇవాళ (శనివారం) తెలిపారు.
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీ పల్లి మండలంలోని నారమాకులపల్లిలో దారుణం చోటుచేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నారమాకుల పల్లికి చెందిన చెందిన ఆరేటి నీలావతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో బాది చంపిన ఘటన చోటు చేసుకుంది..
Building Collapses: మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో ఇవాళ (శనివారం) మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను ఒక మహిళ చూసినట్లు నివేదించడంతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా జమ్మూలోని ఆర్మీ పాఠశాలలను శనివారం వరకు మూసివేయనున్నారు. భద్రతను నిర్ధారించడానికి కీలకమైన ఆర్మీ మరియు డిఫెన్స్ ఇన్స్టాలేషన్ల వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పంజాబ్ పోలీసులు వారిని వెతికి పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.