Kurkure Packet: కేవలం 20 రూపాయల కుర్‌కురే ప్యాకెట్ కోసం రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ దాడుల్లో 10 మందికి పైగా గాయపడగా, పలువురు పరారీలో ఉన్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో నెలకొంది. వివరాల్లోకి వెళితే.. అతీఫుల్లా అనే వ్యక్తి కిరాణం షాపులో సద్దాం కుటుంబానికి చెందిన పిల్లలు ఓ కుర్‌కురే ప్యాకెట్ కొనుగోలు చేశారు. అయితే, గడువు మీరిన కుర్‌కేరే విక్రయించారని సద్దాం కుటుంబీకులు వచ్చి కిరాణం షాప్ యజమాని అతీపుల్లాను ప్రశ్నించారు.
Read Also: TRAI Data : అక్టోబర్‌లో రిలయన్స్ జియోకు గుడ్ బై చెప్పిన 37 లక్షల మంది కస్టమర్‌లు
దీంతో అతీపుల్లా- సద్దాం కుటుంబాల మధ్య రగడ స్టార్ట్ అయింది. ఇక, ఈ రెండు కుటుంబాల వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇది చాలదన్నట్లు 30 మంది అతీఫుల్లా మనుషులు మరో రెండు వెహికిల్స్ లో వచ్చి సద్ధాం హోటల్‌లో వస్తువులను చెల్లాచెదురుగా పడేసి తమను కొట్టారని వారు ఆరోపించారు. దీంతో ఇరు కుటుంబాలు చన్నగిరి పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై మరోకరు కంప్లైంట్ చేసుకున్నారు. అయితే, అరెస్ట్ చేస్తారనే భయంతో సుమారు 25 మంది పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ బాలచంద్ర నాయక్ వెల్లడించారు. కేవలం ఒక కుర్‌కురే కోసం ఇంత పెద్ద గొడవ జరిగిందా అని గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవకు సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.