AP Crime: డబ్బుల కోసం, ఆస్తుల కోసం ఘర్షణలు అనేది చాలా చిన్న విషయంగా మారిపోయింది.. బంధాలు, బంధుత్వాలు తర్వాత.. ముందు పైసలే కావాలి అనేలా పరిస్థితులు తయారయ్యాయి.. డబ్బుల కోసం అయినవారు.. బయటివారు అనే తేడా లేకుండా.. దాడులు, ప్రతిదాడులు.. కొన్నిసార్లు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నారు.. చివరకు 10 రూపాయలు, వంద రూపాయలకు కూడా ప్రాణాలు పోయిన ఘటనలు కొన్ని చోటు చేసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు 300 రూపాయల కోసం ఒక ప్రాణం తీసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది..
Read Also: Delhi: ఢిల్లీలో టూర్‌లో షిండే ఫ్యామిలీ.. మోడీ, నడ్డా, అమిత్ షాతో భేటీ
కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో ఈ నెల 20వ తేదీన ఇరువురు వ్యక్తుల మధ్య రూ.300 విషయమై ఘర్షణ జరిగింది.. అదికాస్తా దాడికి దారిసింతి.. చాట్ల సతీష్ (27) పై కర్రతో దాడి చేశాడు వెంకటేశ్వరావు అనే వ్యక్తి.. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలయ్యారు చాట్ల సతీష్.. దీంతో, అతడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి సతీష్ మృతి చెందాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, నిందితుడు వెంకటేశ్వరరావు పరార్ కావడంతో.. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..