Extramarital Affair: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానుతండాలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్నను కరెంట్ షాక్ తో తమ్ముడు చంపేశాడు. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వదినతో నిందితుడు తేజావత్ గోపి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆమెతో చనువుగా ఉంటూ రెడ్ హ్యాండెడ్ గా అన్నకు దొరికిపోయాడు నిందితుడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా వదిన లలిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక, అప్పటి నుంచి అన్న శంకర్ పై కక్ష పెంచుకున్న తమ్ముడు.. అతడ్ని చంపేస్తే వదినతో కలిసి ఉండవచ్చని హత్యకు స్కెచ్ వేశాడు.
Read Also: Dhanush : ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ టైటిల్ తో ధనుష్
అయితే, నిన్న పనికి వెళ్లి వచ్చిన తేజావత్ శంకర్ మద్యం తాగి ఇంట్లో పడుకున్నాడు. ఇక, అర్ధరాత్రి అన్న నిద్రలో ఉండగా అతని కాలు, చేతికి కరెంట్ వైర్లు చుట్టి.. కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన నిందితుడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని పట్టుకుని రిమాండ్ కి తరలించారు. కాగా, తేజావత్ శంకర్ గతంలో రెండు పెళ్లిలు చేసుకుని విడాకులు కూడా తీసుకున్నాడు. ఇక, ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఏడాది క్రితం తల్లిదండ్రులు లేని మరో యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుని నాను తండాకు తీసుకుని వచ్చాడు. ఈ క్రమంలోనే శంకర్ భార్యతో తమ్ముడు గోపి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.