మంచు మనోజ్, మౌనిక దంపతులు చంద్రగిరి పోలీసుస్టేషన్ చేరుకుని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఘటనపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనపై, మౌనికపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని అందులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని మంచు మనోజ్‌కు సూచించారు పోలీసులు.
South Korea: దక్షిణ కొరియా దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను కొరియన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విచారణ అధికారులు వెల్లడించారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో కోడి పందాల శిబిరం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కంకిపాడులో చలువాది రాజా ఆధ్వర్యంలో కోడి పందాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.. అక్కడ వణుకూరు - పునాదిపాడు కుర్రోళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. బీరు సీసాలతో కొందరు యువకులు వీరంగం సృష్టించారు.
South Africa Gold Mine: దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని సుమారు 100 మంది అక్రమ మైనర్ కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం.. ఈ కార్మికులందరూ సౌతాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు.
Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద 350 గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం.. పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Online Betting: వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అనే లైశెట్టి రాజు కుమార్ (26) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Road Accident: మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం నాడు రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు.
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్దీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపిన కేసులో 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపులన్నీ బూటకమని తేలింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల వివాహిత.. భర్త వద్ద ఆరుగురు పిల్లలను వదిలేసి.. ఓ బిచ్చగాడితో వెళ్లినట్లు పోలీసు కేసు నమోదు అయింది.