Pro-Pakistan Slogan: తన సోషల్ మీడియా ఖాతాలో పాకిస్తాన్ అనుకూల నినాదాన్ని పోస్ట్ చేసినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా పరిధిలో గల నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25)గా గుర్తించారు. అయితే, భారతీయుల మనోభావాలను కించపరిచేలా ఇమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ స్లోగ్స్ ఇచ్చాడు. దీంతో నెటిజన్స్ పోలీసులకు సమాచారం తెలిపారు.
Read Also: Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ
అయితే, ఇమ్రాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అనే స్లోగ్స్ ఇవ్వడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాక్ష్యాలను సేకరించిన తరువాత.. తన పోస్ట్ ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బ తీసినందుకు నిందితుడిని బరేలీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్ శర్మ అదుపులోకి తీసుకున్నారు. కాగా, సోషల్ మీడియాలో భారత్ కు వ్యతిరేకంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.