Manchu Manoj: మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకోవడంతో.. ఈ వ్యవహారం మరోసార పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.. ఈ రోజు మంచు మనోజ్, మౌనిక దంపతులు చంద్రగిరి పోలీసుస్టేషన్ చేరుకుని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఘటనపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనపై, మౌనికపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని అందులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని మంచు మనోజ్‌కు సూచించారు పోలీసులు.. అయితే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు మనోజ్.. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడినట్టుగా తెలుస్తుండగా… మనోజ్ భార్య మౌనిక, ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళనకు గురయ్యారు.. ఇక, తిరిగి కోలుకున్న తర్వాత మల్లయ్యగారిపల్లెకు వెళ్లిపోయారు మంచు మనోజ్ దంపతులు..
Read Also: Maha Kumbh Mela 2025: కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్