Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తిరుపతిలో జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఐదుగురు మృతిచెందారు.. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి దగ్గర ఘోరు ప్రమాదం చోటు చేసుకుంది.. కంటైనర్ వాహనం కిందకు దూసుకెళ్లింది కారు.. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, 9 ఏళ్ల బాలుడు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.. ప్రమాదానికి గురైన వాహనం.. తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండడంతో.. మృతులు కూడా ఆ రాష్ట్రానికి చెందినవారిగానే అనుమానిస్తున్నారు..
Read Also: Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీలో బ్యూటిఫుల్ హీరోయిన్ ఫిక్స్..?