Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.
Read Also: Gurpatwant Singh Pannun: పాక్‌పై యుద్ధంలో సిక్కులు పాల్గొనవద్దు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పిలుపు..
వివరాల్లోకి వెళితే.. ఆ వృద్ధురాలికి ఉన్న పొలం మొత్తం రాయించుకొని, ఒంటి మీద బంగారం తీసుకొని కన్న కూతురు ఇంట్లో నుంచి నాలుగు రోజుల క్రితం తరిమేసింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు.. ఏం చేయాలో తెలియక రాత్రి పూట ఊత కర్ర సాయంతో బిక్కుబిక్కుమంటూ రోడ్డెక్కింది. కంటిలో నీళ్లు దిగమింగుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ గుర్తుకు వచ్చిన.. వెనక్కి వెళ్లలేదు గమ్యం లేని ప్రయాణం కొనసాగించింది ఆ వృద్ధురాలు. చాలా దూరం నడిచిన తర్వాత అడవి ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె అలికిడి శబ్దాలు విని స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. అధికారులు వచ్చి ఆమెకు కట్టేసి ఉన్న తాళ్ల విప్పి.. ఏ ఊరు మీది ఏమైందంటూ ఆ వృద్ధురాలిను అడగగా.. తన గాధను వెల్లబోసుకుంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్!
కాగా, తన పేరు వేల్పల భూధవ్వ అని.. తమది జగిత్యాల జిల్లా కేంద్రం ఇస్లాంపురా అని తెలిపింది. తన భర్త చనిపోయిన తర్వాత నా కూతురు ఈశ్వరి అత్తగారి ఊరు నర్సింగాపూర్ గ్రామంలోని వాళ్ల ఇంట్లో ఉంటున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎకరం భూమిని, ఇంటిని కూతురు తన పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకుంది.. ఆ తర్వాత నన్ను వేధించడం మొదలు పెట్టింది.. నా బిడ్డ నా మనవడే నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని కన్నీరు మున్నీరై విలపించింది. దీంతో ఏం చేయాలో తెలియక ఇలా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వచ్చాను అని భూధవ్వ తెలిపింది. ఇక, అధికారులు ప్రస్తుతానికి భూదవ్వను సఖి కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన సంచిలో ఉన్న కూతురు ఈశ్వరి ఫోన్ నెంబర్ అధికారులకు ఇవ్వగా.. ఆఫీసర్లు ఆమెకు చేయగా తనకేం సంబంధం లేదంటూ కాల్ కట్ చేసింది. రిజిస్టేషన్ శాఖ ద్వారా భూమి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.