Crime: విశాఖపట్నంలో సంచలనం రేపిన వివాహిత హత్య కేసును భీమిలి పోలీసులు ఛేదించారు. మహిళతో సన్నిహితంగా ఉన్నవాడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానితుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఇక, మృతురాలు వెంకట లక్ష్మీగా పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో లభించిన ఆనవాళ్లు ద్వారా మృతురాలని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే, మృతురాలుకు ఇద్దరు కుమారులు కానూరి చంద్రమౌళి (డిగ్రీ), కానూరి దామోదర్ (10th క్లాస్ ) ఉన్నారు.
Read Also: IPL 2025 : పవర్ ప్లే దెబ్బతీసింది… SRH ఓటమికి కారణాలు ఇవే..!
అయితే, నాలుగేళ్ళ క్రితం వెంకట లక్ష్మీ భర్త భర్త సూరిబాబు మృతి చెందారు. కాగా, ఒంటరిగా పిల్లలతో కలిసి ఉంటున్న ఆమె క్రాంతి కుమార్ తో చనువు ఏర్పడింది. దీంతో తరచు కలిసే వాళ్లని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, నిన్న రాత్రి ఫోన్ చేసి బయటికి రప్పించిన క్రాంతి కుమార్.. ఆ తర్వాత వివాహిత శవమై కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఎక్కడో హత్య చేసి నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.. ఈ హత్య కేసులో క్రాంతి కుమార్ తో పాటు మరికొందరి ప్రమేయం ఉంటుందని కుటుంబ సభ్యుల ఆరోపణలు చేస్తున్నారు. కాగా, అనుమానితుడు క్రాంతి కుమార్ దివిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.