సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ పై దాడి చేసారు. ఓ కేసులో ఇద్దరు నిందితులను విచారణ కై పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన పోలీసులు… విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా కానిస్టేబుల్ కిరణ్ పై దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ కానిస్టేబుల్ కిరణ్ ను వెంటనే వైద్యం నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గాయపడ్డ కానిస్టేబుల్ తలపై ఆరు కుట్లు పడటంతో ప్రస్తుతం అక్కడే వైద్యం తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు విచారణ జరిపి దాడి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. కానిస్టేబుల్ కిరణ్ పై దాడికి పాల్పడ్డ శ్రీనాథ్ అనే నిందితున్ని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ ఘటన పై విచారణ జరుపుతున్నారు గోపాలపురం ఏసిపి వెంకట రమణ.