లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పొడిగిస్తూ.. మంగళవారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. గతంలో విధించిన లాక్‌డౌన్ ఇవాళ కూడా అమల్లో ఉండనుంది.. కొత్త లాక్‌డౌన్ సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. కానీ, ఈ విషయంలో గందరగోళానికి గురైన ప్రజలు… ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా భారీగా రోడ్లపైకి వస్తున్నారు.. గురువారం నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల వరకు.. ఇళ్లకు చేరుకోవడానికి అదనంగా మరో గంటతో సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉంటాయి.. కానీ, అది ఈరోజు నుంచే అనే భ్రమలో ఉన్న ప్రజలు.. ఈ విషయాన్ని గమనించక అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు.. దీనిపై ప్రజలకు అవగాహాన కల్పించాలని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తున్నారు ఉన్నతాధికారులు.