అమానుషం.. కోడలిని అమ్మేసిన మామ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి.. కానీ, డబ్బుల కోసం ఆశపడి తన కోడలినే అమ్మేశాడు… తన కుమారుడి భార్యను రూ.80 వేలకు ఓ ముఠాకు అమ్మేందుకు సిద్ధపడి డీల్ కుదుర్చుకున్నాడు.. అయితే, ఈ విషయం కుమారుడికి తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో, దాని వెనుక ఉన్న ఓ ముఠా గుట్టురట్టుఅయ్యింది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్ లో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన కోడలిని గుజరాత్‌కు చెందిన ఓ ముఠాకు రూ.80వేలకు అమ్మేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఓ వ్యక్తి.. బాధితురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలితో సహా రైల్వేస్టేషన్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.. బాధితురాలు వారి చెరలో పడకుండా విడిపించారు. మొత్తంగా ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా.. అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అయితే, ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ అయిన చంద్రరామ్, మరో నిందితుడు పరారీలో ఉన్నారు. కాగా, చంద్రరామ్ కు మహిళలను అమ్మడం కొత్తకాదని.. ఇప్పటివరకు 300 మంది మహిళలను కొనుగోలు చేసి.. ఇతర వ్యక్తులకు విక్రయించినట్టు ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా తన కోడలినే అమ్మడం.. అది కుమారుడికి తెలియడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..